న్యూడిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి వెయ్యి రూపాయలు డొనేషన్ఇచ్చారు. ఈమేరకు డొనేషన్రసీదును ట్విట్టర్లో షేర్ చేస్తూ.. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. “నేను బీజేపీ ఫండ్ కోసం రూ.1,000 విరాళం ఇచ్చాను. డొనేషన్‌తో బీజేపీ బలోపేతానికి, తద్వారా బలమైన దేశ నిర్మాణానికి సహాయపడండి”అని ప్రధాని ట్వీట్‌చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా పార్టీకి రూ.1,000 డొనేట్ చేశారు. “నమో యాప్‌ద్వారా బీజేపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. మీరు కూడా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొని బీజేపీని శక్తిమంతం చేయొచ్చు’’ అని నడ్డా ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి సందర్భంగా శనివారం బీజేపీ పార్టీ ఫండ్ డొనేషన్ డ్రైవ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రధాని, నడ్డా విరాళాలు ఇచ్చారు.
