సంగారెడ్డి టౌన్, వెలుగు : అసెంబ్లీఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్‌చేశారు. మంగళవారం సంగారెడ్డి తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రవి మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా రైతు భరోసా, రుణమాఫీ అందలేదన్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీమా అమలు చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్సర్కార్ ఆ దిశగా ముందుకు వెళ్లకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో దోమల విజయకుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, శివంగుల నాగరాజ్, శివ, లింగమూర్తి, శరత్, సతీశ్, రాము, దుర్గయ్య, పోలీస్ శేఖర్, వెంకట్ పాల్గొన్నారు.