అంబానీ, అదానీ కోసమే బీజేపీ పని చేస్తున్నది

  •     ఎమ్మెల్సీ, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం  

పాల్వంచ,వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  అంబానీ, అదానీకి దోచిపెట్టే విధంగా పాలన కొసాగిస్తోందని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో కొమరం భీమ్ భవనంలో శుక్రవారం నిర్వహించిన టీజేఎస్ జిల్లా ప్లీనరీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సాధన తర్వాత ప్రజల సమస్యలు చెప్పేందుకు గత బీఆర్ఎస్ పాలకులు చాన్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నో పోరాటాలతో ఆవిర్భవించిన తెలంగాణ ఒక్కరికే పరిమితం కాకూడదనే ఉద్ధేశంతోనే మాటకు విలువ ఇచ్చే కాంగ్రెస్ తో కలిసి నడిచామని పేర్కొన్నారు.  ప్రజా సమస్యలపై టీజేఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన తర్వాత బీజేపీలోకి వెళ్లాలని ప్రతిపాదన వచ్చిందని, ఆ ఉద్దేశం లేక కాంగ్రెస్ తో కలిశామన్నారు. ఈ సమావేశంలో  రాష్ట్ర నేతలు గోపగాని శంకర్రావు, మహేశ్, మల్లెల  రామనాథం, జిల్లా అధ్యక్షులు బరగడి దేవదానం, నబీసాహెబ్, కుడికాల ఆంజనేయులు, పి. కరుణాకర్ రెడ్డి, రవూఫ్, కొమరం కాంతారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.