ప్రధాని మోదీ మహిళా పక్షపాతి : రామచంద్రా రెడ్డి

అయిజ, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా పక్షపాతి అని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి అన్నారు. కలకత్తా నుంచి మహిళా సంఘాల సభ్యులతో ప్రధాని బుధవారం నిర్వహించిన వర్చువల్ ప్రసంగాన్ని అయిజ పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల సభ్యులతో కలిసి చూశారు.  

అనంతరం ఆయన మాట్లాడుతూ..  దేశంలో 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పీఎం ఆవాస్ యోజన ద్వారా 4  కోట్ల ఇండ్లు,  టాయిలెట్లు నిర్మించారని చెప్పారు.  ఆలంపూర్ అసెంబ్లీ కన్వీనర్ మెడికల్ తిరుమల్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ నరసింహయ్యశెట్టి, నాయకులు జగదీశ్వర్ రెడ్డి, భగత్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, రఘు, భీమేశ్, మురళి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.