బీజేపీ ఐదో జాబితా విడుదల తెలంగాణలో పూరైన సీట్ల కేటాయింపు

పార్లమెంట్ లోక్‪సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ 111 మంది అభ్యర్థులతో ఐదవ లిస్ట్‪ను విడుదల చేసింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి టికెట్లు కేటాయించగా.. మిగిలిన రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఈరోజు ప్రకటించింది. ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.  వరంగల్ లో ఆరూరి రమేష్, ఖమ్మంలో తాండ్రా వినోద్ రావుకు టికెట్ కేటాయించారు.  

దీంతో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు అయ్యారు. దీంతో తెలంగాణాలో టికెట్ ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర టికెట్ కేటాయించింది.