టీడీపీ, జనసేనకు బీజేపీ నుండి షాక్ తప్పదా..?

2024 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకీ రెట్టింపవుతుంది. మిగతా పరిణామాల మాట ఎటున్నా కానీ, టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ ని మించిన ఉత్కంఠ రేపుతోంది. బీజేపీతో పొత్తు గురించి ఏ మాట తేల్చకుండానే టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించటం, భారీ ఎత్తున బహిరంగసభ కూడా నిర్వహించటం జరిగిపోయింది.

ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని, బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తుకు సుముఖత చూపలేదని సమాచారం. మరో పక్క ఎన్డీయేలో చేరే అంశంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేనందునే బీజేపీ ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.

ALSO READ :- మార్చిలో 14 రోజులు బ్యాంకులు బంద్

టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీల్లో టికెట్ దక్కని వారు 30 నుండి 40మంది వరకు బీజేపీతో టచ్ లో ఉన్నారని వారందరిని పార్టీలో చేర్చుకుంటే 18 శాతం ఓట్ షేర్ ని సంపాదించవచ్చని బీజేపీ పెద్దలు బావిస్తున్నారట. ఇలాంటి మంచి ఛాన్స్ ఉన్నప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు బలాన్ని పెంచటం ఎందుకని బీజేపీ భావిస్తుందని, 2024 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రేపో, మాపో టీడీపీ, జనసేన కూటమికి బీజేపీ పెద్ద షాక్ ఇవ్వనుందన్నమాట.