బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదికొస్తే వైఎస్సార్సీపీ మూటాముల్లే సర్దుకోవాల్సిందేనని బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఏపీలో హిందు ధర్మంపై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. దేవుళ్ళ విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇక్కడ అధికార పార్టీ ఒక మతానికి వత్తాసు పలుకుతుంటే.. అక్కడ ఒక మతమే రాజ్యం ఏలుతుందన్నారు. ఏపీలో దమ్మున్న కార్యకర్తలు ఉన్నారని..వారి సహనాన్ని పిరికి తనంగా బావించొద్దన్నారు.
ఒక మతానికి వత్తాసు పలికితే ఇక్కడ హిందువులు ఓటు బ్యాంకుగా మారి దుబ్బాక, జీహెచ్ఎంసీలో బుద్ది చెప్పారన్నారు. తిరుపతిలో హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలన్నారు. ఏడుకొండల వాడ వెంకటరమణ అనే పార్టీ కావాలా?.బైబిల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ కావాలా?.. భగవద్గీత చేత పట్టుకొని వచ్చే పార్టీ కావాలా ఆలోచించాలన్నారు. తిరుపతి ఉప ఎన్నిక పలితాల కోసం దేశం ఎదురుచూస్తుందన్నారు. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు.
