లక్నో: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం కోసం వస్తున్న ఫండ్స్‌ను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. కరోనా టైమ్‌లో ప్రజల దగ్గర నుంచి చందాలు వసూలు చేయడం ఏంటని సీరియస్ అయ్యారు. ప్రాచీన భారతదేశంలో చందాల కల్చర్ లేదని, మనకు దక్షిణ ఇచ్చే ఆచారం మాత్రమే ఉందన్నారు. ఒకవేళ బీజేపీ ఒప్పకుంటే దక్షిణ ఇవ్వడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పెట్రో ధరల భారం దేశ యువత, సామాన్య ప్రజానీకం, రైతులపై పడుతోందన్నారు.
