అవినీతి ఉబిలో బీజేపీ పుస్తకావిష్కరణ

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ‘అవినీతి ఉబిలో కూరుకుపోయిన బీజేపీ’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు అవినీతి, అధిక ధరలు, నిరుద్యోగ సమస్యను ప్రజల ముందు ఉంచిందని చెప్పారు. 2014 ఎన్నికలో బీజేపీ అధికారం చేపట్టాక నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. ఏడాదికి కోటి జాబ్స్  ఇస్తామని హామి ఇచ్చి మోసం చేసిందన్నారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎం రామ్మోహన్, నర్సింలు,  కేశవులు, ఆనంద్, విల్సన్, శ్రీసు, ప్రకాశ్, సందీప్, భాగ్యలక్ష్మి, బాలేశ్వరి పాల్గొన్నారు.