రేపు ఢిల్లీలో బీజేపీ భీమ్ పాదయాత్ర

రేపు ఢిల్లీలో బీజేపీ భీమ్ పాదయాత్ర

రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పై  బీజేపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. నిరసనలను, ఆందోళనలను కొనసాగిస్తోంది. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పార్లమెంట్ వరకు బీజేపీ భీమ్ పాదయాత్ర చేపట్టనుంది. బండి సంజయ్ తోపాటు పాదయాత్రలో ఎంపీలు సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జ్, కోలార్ ఎంపీ మునుస్వామి తదితరులు పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ భవన్ నుండి బీజేపీ భీమ్ పాదయాత్రను నాయకులు ప్రారంభించనున్నారు. 

ఇవి కూడా చదవండి: 

ముగిసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ

రాహుల్ గాంధీ మా సంస్కృతి తెలుసుకోవాలి