న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ఆల్‌టైమ్ హై అయిన 68,990 డాలర్ల (రూ. 51 లక్షల) ను టచ్ చేసింది. గ్లోబల్‌గా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో హెడ్జింగ్ కోసం క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్టర్లు డబ్బులు పెడుతున్నారు. ఎథరమ్, కార్డానో, సోలనా వంటి ఇతర క్రిప్టోలు కూడా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్‌కు హెడ్జ్‌గా బిట్‌కాయిన్‌ను చూస్తున్నారు. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగితే కరెన్సీల వాల్యు తగ్గిపోతుంది. అదే బిట్‌కాయిన్ వాల్యు మాత్రం తగ్గదు. అందుకే కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేసేవారు ఎక్కువగా నష్టపోకుండా ఉండడానికి, క్రిప్టో కరెన్సీల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీన్నే హెడ్జింగ్ అని పిలుస్తారు. కరెన్సీల విలువను ప్రభుత్వాలు తగ్గించే వీలుంటుంది. కానీ, బిట్‌కాయిన్ సప్లయ్ మాత్రం లిమిటెడ్‌గా ఉంటుంది కాబట్టి ఈ క్రిప్టో వాల్యూ పెరుగుతూనే ఉంటుందని అంచనా. బిట్‌కాయిన్ పెరగడం ఈ ఏడాది అగస్ట్‌లో తిరిగి స్టార్టయ్యిందని, అప్పటి నుంచి పెరుగుతూనే ఉందని సీఎఫ్ బెంచ్‌మార్క్స్ సీఈఓ సూ చంగ్ అన్నారు. బిట్‌కాయిన్ ఈటీఎఫ్ అక్టోబర్‌లో లాంచ్ అవుతుందనే అంచనాలతో ఈ ర్యాలీ స్టార్టయ్యిందని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో ప్రస్తుతం బిట్‌కాయిన్ పెరుగుతోందని అన్నారు. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా 30 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం గమనించాలి. కాగా, ఆల్‌టైమ్ హైని చేరుకున్న బిట్‌కాయిన్ కిందకు పడుతోంది. బిట్‌కాయిన్ గురువారం (సాయంత్రం) 2.9 శాతం నష్టంతో 64,946 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బిట్‌కాయిన్ హెడ్జింగా?
ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌ను హెడ్జింగ్ ఆప్షన్‌గా చూస్తున్నారు. ముందు గోల్డ్‌ను ఈక్విటీలకు హెడ్జ్‌గా చూసేవారు. కానీ, గోల్డ్‌తో పోలిస్తే బిట్‌కాయిన్ ఎక్కువగా పెరుగుతోంది. మరికొంత మంది ఇన్వెస్టర్లు బిట్‌కాయిన్‌ను ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్‌గా చూడడం లేదు. బిట్‌కాయిన్ హిస్టరీ గోల్డ్‌తో పోలిస్తే తక్కువని చెబుతున్నారు. ‘ఇన్‌ఫ్లేషన్‌కు హెడ్జ్‌గా బిట్‌కాయిన్ ఉండకూడదని అనడం లేదు. కానీ, ఇన్‌ఫ్లేషన్ హెడ్జ్‌గా గోల్డ్ శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. హెడ్జ్‌గా బిట్‌కాయిన్‌తో పాటు గోల్డ్ కూడా ఉండడం బెటర్’ అని మిల్లర్ టేబక్ ఫ్లస్ సీఎంఎస్ మ్యాట్ మేలే అన్నారు. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఔన్స్ గోల్డ్ ధర (స్పాట్) 1.8 శాతం పడింది. అదే బిట్‌కాయిన్ రేటు 130 శాతం పెరిగింది.
