బిట్​ బ్యాంక్​: కేంద్ర ప్రభుత్వరంగ పరిశ్రమలు

  •     దేశంలో తొలి బీహెచ్​ఈఎల్​ను 1956లో స్థాపించారు. 
  •     తెలంగాణ రాష్ట్రంలో బీహెచ్ఈఎల్​ను 1963లో స్థాపించారు.
  •     తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రాపురం ప్రాంతంలో బీహెచ్​ఈఎల్​ను స్థాపించారు.
  •     ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ 1967లో స్థాపించారు.
  •     తెలంగాణ రాష్ట్రంలోని ఏఎస్​రావు నగర్​ ప్రాంతంలో ఈసీఐఎల్​ను స్థాపించారు.
  •     ఢిల్లీ మెట్రో రైల్​ కార్పొరేషన్​ కోసం కోచ్​లను భారత్​ ఎర్త్​ మూవర్స్​ తయారు చేస్తోంది.
  •     తెలంగాణలో ఇండియన్ డ్రగ్స్ అండ్​ ఫార్మాసూటికల్స్​ లిమిటెడ్​ను 1961లో స్థాపించారు. 
  •     హైదరాబాద్​లోని ఐడీపీఎల్​లో సింథటిక్ డ్రగ్స్​ తయారు చేస్తారు.
  •     ఐడీపీఎల్​ను తెలంగాణలోని బాలానగర్ ప్రాంతంలో స్థాపించారు.
  •     ఔషధ తయారీలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
  •     ఆసియాలో అతిపెద్ద యాంటీబయోటిక్స్​ తయారీ కేంద్రం రిషికేష్​ ప్రాంతంలో ఉంది.
  •     దేశంలో మొదటి ఔషధ తయారీ పరిశ్రమ పింప్రిలో ఉంది.
  •     హైదరాబాద్​లో రెడ్డీస్ ల్యాబోరేటరీని 1984లో స్థాపించారు.
  •     హెపటైటిస్​ టీకా ఎస్​హెచ్​ఏఎన్​వీఏసీను శాంతాబయోటెక్​ సంస్థ తయారు చేస్తోంది.
  •     జీనోమ్​ వ్యాలీ బాచుపల్లి ప్రాంతంలో ఉంది.
  •     శాంతాబయోటెక్​ 1993లో స్థాపించారు.
  •     భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలో మొదటి బయోటెక్​ పార్క్​ల సమూహ జీనోమ్​ వ్యాలీ.
  •     అప్పెరల్​ పార్క్​ గుండ్లపోచంపల్లి ప్రాంతంలో ఉంది.
  •     సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్​పూర్​ ప్రాంతంలో మెడికల్​ డివైజెస్​ పార్క్ ఉంది.
  •     హిందుస్థాన్​ కేబుల్స్​ లిమిటెడ్​ హైదరాబాద్​, రూప్​నారాయణ్​ ప్రాంతంలో ఉంది.
  •     హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ను 1964లో స్థాపించారు.
  •     హెచ్​ఏఎల్​ను హైదరాబాద్​లోని బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
  •     హైదరాబాద్​లోని హెచ్​ఏల్​లో విమానాలకు సంబంధించి విడిభాగాలు మిగ్​ విమానాల ఎలక్ట్రిక్​ పరికరాలు తయారవుతాయి. 
  •     హైదరాబాద్​లో మిశ్రమ ధాతు నిగమ్​ లిమిటెడ్​ను 1973లో స్థాపించారు.
  •     రిఫ్రిజరేటర్లు, బ్యాలెట్​ బాక్సులు, బస్సుబాడీలు ఆల్విన్​ పరిశ్రమలో తయారవుతాయి.
  •     గ్యాస్​ సిలిండర్లు ఎలక్ట్రోలక్స్​ పరిశ్రమలో తయారవుతాయి.
  •     తెలంగాణలో భారజల కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు.
  •     న్యూక్లియర్​ ఫ్యూయల్​ కాంప్లెక్స్​ హైదరాబాద్​ ప్రాంతంలో ఉంది.
  •     రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతంలో ప్రపంచస్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేయబోతున్నారు.
  •     నిర్మల్​ పెయింటింగ్స్​, టాయ్స్​ పరిశ్రమ 1955లో ఏర్పడింది.
  •     నిర్మల్​ పెయింటింగ్స్​, టాయ్స్​ తయారీలో పునికి కలపను వాడుతారు.
  •     దమ్ముగూడెం ప్రాంతం లేసుల తయారీ పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచింది.
  •     డోక్రామెటల్​ క్రాప్ట్స్​కు ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​ జిల్లాలు ప్రసిద్ధి.
  •     డోక్రామెటల్​ క్రాప్ట్స్​ తయారీలో ఎర్రమట్టి, మైనం, ఇత్తడి ఉపయోగిస్తారు.
  •     తెలంగాణలో ముత్యాల ఉత్పత్తికి చందంపేట ప్రాంతం ప్రసిద్ధి.
  •     తివాచీలకు వరంగల్​ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
  •     సిల్వర్​ ఫిలిగ్రికి కరీంనగర్ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
  •     పెంబర్తి ఇత్తడికళకు ప్రసిద్ధి.
  •     గొల్లభామ చీరలకు సిద్దిపేట ప్రాంతం ప్రసిద్ధి.
  •     సిద్దిపేట గొల్లభామ వస్త్రాలకు 2012లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. 
  •     గద్వాల్​ చీరలకు 2011లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
  •     పోచంపల్లి ఇక్కత్​ చీరలను 1956లో మొదటిసారిగా కర్నాటి అనంతరాములు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.