బిట్​ బ్యాంక్​ : తెలంగాణ ఉద్యమం.. కీలక అంశాలు..

కేటీపీఎస్​లో విద్యుత్​ శాఖ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించడం 1969 జై తెలంగాణ ఉద్యమానికి తక్షణ కారణమైంది.అన్నబత్తుల రవీంద్రనాథ్​ 1969, జనవరి 8న దీక్ష ప్రారంభించారు. ఆయనతోపాటు దీక్షలో ఖమ్మం మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​ కవిరాజ మూర్తి కూర్చున్నారు.
    

  • 1969 ఉద్యమం సందర్భంగా పాల్వంచలో రోజు కూలీ కార్మికుడు పోటు కృష్ణమూర్తి జనవరి 10న దీక్ష ప్రారంభించాడు.
  •  1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి కొలిశెట్టి రామదాసు కారణం. ఈయన తెలంగాణ ప్రాంతీయ సమితిని స్థాపించాడు. 
  • 1969 ఉద్యమం సందర్భంగా జనవరి 20న మొదటి కాల్పులు శంషాబాద్​లో జరిగాయి. 
  • 1969 ఉద్యమం సందర్భంగా ఓయూలో ఏర్పడిన ఐక్యకార్యాచరణ కమిటీ కార్యదర్శి మల్లికార్జున్​. 
  • 1969 ఉద్యమంలో తొలి అమరులు శంకర్, కృష్ణ. వీరు మెదక్​ జిల్లా సదాశివపేటలో జరిగిన కాల్పుల్లో మరణించారు. 
  • 1969, జనవరి 21న జీవో నెంబర్ 36ను జారీ చేశారు. 
  • జనవరి 18 నుంచి 19 వరకు జరిగిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా జీవో నెంబర్ 36ను విడుదల చేశారు. 
  • 1969 ఉద్యమంలో మొదటి తెలంగాణ బంద్​ 1969, మార్చి 3న జరిగింది. 
  • మార్చి 8, 9వ తేదీల్లో జరిగిన రెడ్డి హాస్టల్​ సదస్సును రాజాబహద్దూర్​ వెంకట్రాంరెడ్డి ప్రారంభించగా టీఎన్ సదాలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సదస్సును రావాడ సత్యనారాయణ ప్రారంభించారు. 
  • రెడ్డి హాస్టల్​ సదస్సులో శ్రీధర్​రెడ్డి క్విట్​ తెలంగాణ నినాదం ఇచ్చారు. 
  • రెడ్డి హాస్టల్​ సదస్సు సందర్భంగా తెలంగాణ చిత్ర పటాన్ని మునీర్​ జమాల్​(లీడర్​ పత్రిక సంపాదకుడు), ఈవీ పద్మనాభం(ఫ్లాస్​ అండ్​ ఫెలోమన్​ పత్రిక), ఆదిరాజు వెంకటేశ్వరరావు (తెలంగాణ రాష్ట్రోద్యమాలు పుస్తక రచయిత) రూపొందించారు. 
  • రెడ్డి హాస్టల్​ సదస్సులో చేసిన ప్రతిజ్ఞ వీరగడ్డ అయిన తెలంగాణ పుత్రులమైన మేము బానిస బంధాలను ఛేదించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సర్వస్వాన్ని త్యాగం చేస్తాం. 
  • తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ అసెంబ్లీ ఎదుట సీమాంధ్ర మాజీ ఎమ్మెల్యే కొర్రపాటి పట్టాభిరామయ్య నిరాహార దీక్ష చేశాడు. 
  • నవశక్తి పత్రిక సంపాదకుడు కొర్రపాటి పట్టాభిరామయ్య. 
  • తెలంగాణ రాష్ట్రం ఎందుకు అన్న కరపత్రాన్ని కొర్రపాటి పట్టాభిరామయ్య విడుదల చేశారు. 
  • 1969 ఉద్యమ కాలంలో ఏర్పడిన అడ్వకేట్ల సంఘానికి అధ్యక్షుడు బి.సి.జైన్​.
  • 1969, మార్చి 17ను విద్యార్థులు ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా, ఉద్యోగులు పోరాటదినంగా జరుపుకున్నారు. 
  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని 1969, మార్చి 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ హిదయతుల్లా తీర్పునిచ్చారు. 
  • సికింద్రాబాద్​ కాల్పులు 1969, ఏప్రిల్​ 4న జరిగాయి. 
  • ఉద్యమంలో మరణించిన కుటుంబాలను ఆదుకోవడానికి హైదరాబాద్​ నగర మేయర్​ కుముద్​నాయక్​ పౌరుల సంఘం ఏర్పాటు చేశారు. 
  • 1969, ఏప్రిల్​ 11న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. 
  • ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా మిగులు నిధుల అధ్యయనం కోసం వశిష్ట భార్గవ కమిటీని ఏర్పాటు చేయగా, రూ.28.34కోట్లు మిగులు నిధులుగా తేల్చారు. 
  • ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా ముల్కీ నియమాలను అధ్యయనం చేయడానికి కైలాస్​నాథ్​ వాంఛూ కమిటీని ఏర్పాటు చేశారు.
  • కైలాస్​నాథ్​ వాంఛూ కమిటీలోని సభ్యులు ఎంసీ సెతల్వాడ్​, నిరేన్​ డే.
  • 1969 జై తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని వరంగల్​ మున్సిపాలిటీ తీర్మానం చేసింది. 
  •  1969, ఏప్రిల్​ 22న తెలంగాణ వంచన దినంగా జరుపుకున్నారు.