- తెలంగాణలో అనార్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు అధికంగా విస్తరించి ఉన్నాయి.
- 75 –100 సెం.మీ.ల కంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను అనార్ధ్ర ఆకురాల్చు అరణ్యాలు అంటారు.
- 50 సెం.మీ.ల కంటే తక్కువ వర్షపాతంలో పెరిగే అరణ్యాలను చిట్టడవులు అంటారు.
- తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా విస్తరించిన గడ్డి భూములను కంచాస్ అని పిలుస్తారు.
- జాతీయ అటవీ విధానం–1952 ప్రకారం దేశంలో 33శాతం కంటే ఎక్కువ అడవులు కచ్చితంగా ఉండాలి.
- 1978లో తొలి సామాజిక అడవుల చట్టం చేశారు.
- 2002లో జీవ వైవిధ్య చట్టం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఏర్పడింది.
- ప్రాక్ దేశపు రాజవృక్షం అని టేకు చెట్టుని పిలుస్తారు.
- నిర్మల్ కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే కలప పునికి.
- పోలీసుల లాఠీలు తయారు చేయడానికి ఉపయోగించే కలప మగవెదురు.
- టెంట్ కర్రల తయారీకి ఉపయోగించే కలప కాజురైన (సరివి).
- బీడీల తయారీకి తుని, తెండు ఆకులను ఉపయోగిస్తారు.
- నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ చైర్మన్గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు.
- తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.
- ప్రతి సంవత్సరం జులైలో వన మహోత్సవం నిర్వహిస్తారు.
- మెగా డైవర్సిటీ దేశాల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో ఉంది.
- ప్రపంచంలో మొదటి జాతీయ పార్క్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21,214 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం 18.93శాతం.
- తెలంగాణలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా కొత్తగూడెం.
- అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా హైదరాబాద్.
- అటవీ శాతం అత్యల్పంగా కలిగిన జిల్లా కరీంనగర్.
- అటవీ శాతం అత్యధికంగా కలిగిన జిల్లా ములుగు.
- దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులను కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
- తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లిలో ఉంది.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణలో దట్టమైన అడవుల విస్తీర్ణం 1624 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణలో మోస్తరు దట్టమైన అడవుల విస్తీర్ణం 9,119 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణ అటవీ విస్తీర్ణంలో పొదల విస్తీర్ణం 2,911 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణ ఓపెన్ ఫారెస్ట్ విస్తీర్ణం 10,471 చ.కి.మీ.
- 2019తో పోలిస్తే 2021 నాటికి తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం 632 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణలో చెట్ల విస్తీర్ణం 2,848 చ.కి.మీ.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, చెట్ల విస్తీర్ణ శాతం 22.30 శాతం.
- ఐఎస్ఎఫ్ఆర్ 2021 ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల విస్తీర్ణ శాతం 2.54 శాతం.
- రాష్ట్రంలో ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ములుగులో ఉంది.
- రాష్ట్రంలో గుర్తించిన మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం అమీన్పూర్ చెరువు.
- తెలంగాణ రాష్ట్ర పక్షుల స్వర్గంగా పిలిచే జలాశయం అమీన్పూర్ చెరువు.
- కొత్తగూడెం ప్రాంతంలో అత్యంత దట్టమైన అడవులు ఉన్నాయి.
- తెలంగాణలో 80 శాతం వృక్షాలు హార్ట్ వికియా బినాట్, అల్ఫిజియామరా వృక్ష జాతికి చెందినవి.