ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గత పదిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి భారతీయుల్ని క్షేమంగా స్వదేశానికి తరలిస్తున్నారు. ఉక్రెయిన్‌తో పాటు.. చుట్టుపక్కల ఉన్న రొమేనియా, పోలాండ్,స్లోవెకియా,హంగేరి నుంచి భారతీయ విద్యార్థుల్ని ఇండియాకు తీసుకొస్తున్నారు. తాజాగా రొమేనియాలో భారతీయ విద్యార్థి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. రొమేనియా బార్డర్‌లో ఏర్పాటు చేసిన క్యాంపులో కార్తీక్ అనే ఇండియన్ స్టూడెంట్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్‌తో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్యంపులో ఉన్నవారంతా కార్తీక్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు.
Birthday of an Indian student, Kartik was celebrated at a camp on Romanian border yesterday. pic.twitter.com/wGWAEC6tx1
— ANI (@ANI) March 5, 2022
