ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

  • గద్వాల టౌన్ లోని ప్రైవేట్ 
  • ఆస్పత్రిలో గర్భిణి డెలివరీ 
  • తల్లీ బిడ్డల ఆరోగ్యం క్షేమం

గద్వాల, వెలుగు : ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు గర్భిణి జన్మనిచ్చింది. జోగుళాంబ జిల్లా గద్వాల టౌన్ అనంత హాస్పిటల్ లో సోమవారం ఘటన జరిగింది. గద్వాల టౌన్ వడ్డే వీధికి చెందిన జయశ్రీ, నరేశ్ దంపతులకు 2020లో వివాహమైంది. 2022లో తొలికాన్పులో పాప జన్మించింది. సోమవారం రెండో కాన్పులో ఒకేసారి ముగ్గురు శిశువులకు జయశ్రీ జన్మనిచ్చింది. ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి డాక్టర్ అశ్విని తెలిపారు.

హాస్పిటల్ లో తొలిసారి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించడం.. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సర్జరీ చేసి కాన్పు చేయగా.. డాక్టర్ వినిషారెడ్డి, డాక్టర్ బిందు సాగర్ లకు నరేశ్, జయశ్రీ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.