తుది దశకు రోళ్లవాగు పనులు

  • 15 రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీ వచ్చే చాన్స్​
  • పర్మిషన్ రాగానే 3 నెలల్లో ప్రాజెక్ట్​పూర్తిచేసేలా ప్రణాళిక
  • ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 864 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ మునక
  • ప్రత్యామ్నాయంగా రెవెన్యూ ల్యాండ్ కేటాయింపునకు సర్కార్​ఓకే 
  • ప్రాజెక్టు పూర్తయితే ఒక టీఎంసీ నీటి నిల్వకు అవకాశం

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్ట్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మరో 15 రోజుల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీ వచ్చేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. పర్మిషన్​రాగానే పనులు మొదలు పెట్టి మూడు నెలల్లోగా పూర్తి చేసేలా ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 864 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్​ మునుగుతుండగా.. దానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలో ఆ శాఖ నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోసీ రాగానే పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. 

ఈ ప్రాజెక్ట్​పూర్తయితే ప్రస్తుతమున్న 0.25 టీఎంసీ కెపాసిటీ నుంచి 1 టీఎంసీకి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.  కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు​పూర్తికాకపోవడంతో వచ్చే సీజన్ పంట కోసం పాత విధానంలో నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిధుల జాప్యంతో నత్తనడకన పనులు

బీర్పుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని రోళ్లవాగు చెరువు 0.25టీఎంసీలు కెపాసిటీ ఉంది. ఈ చెరువు కింద బీర్పూర్, ధర్మపురి మండలాల్లో ఆయకట్టుకు నీరందేది. కాగా 20 వేల ఎకరాలకు సాగునీరందేంచేలా రోళ్లవాగును ఆధునీకరించాలని 2017లో నాటి ప్రభుత్వం పనులు చేపట్టింది.

 కెపాసిటీ 0.25 టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి పెంచాలని నిర్ణయించారు. ఆ టైంలో ఈ పనులకు రూ.60.25కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. నిధుల విడుదలలో జాప్యంతో ఆ పనులు నిలిచిపోయాయి. అనంతరం భారీ వరదలకు అప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలు దెబ్బతిన్నాయి. మరోసారి పనులు చేపడుదామని చూసినప్పటికీ అంచనా వ్యయం రూ.152కోట్లకు చేరడంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. 

పర్మిషన్ లేక నిలిచిన పనులు

రోళ్లవాగు చెరువు గుట్టల మధ్య ఉండడంతో వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటితో పాటు శ్రీరామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీ-53, 12 ఎల్, 1- ఆర్ కాలువల ద్వారా నీరు చేరుతోంది. ప్రాజెక్టు ఆధునికీకరణ లో భాగంగా చేపట్టిన పనుల్లో 1,240 మీటర్ల నిర్మాణం పూర్తి కాగా, 25 మీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు దిగువకు నీరు విడుదల చేసేందుకు 3 తూములకు గేట్లు బిగించాల్సి ఉండగా, ఫారెస్ట్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నుంచి పర్మిషన్లు లేక పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడింది. తూముల గేట్లు బిగిస్తే ప్రాజెక్టులో ఒక టీఎంసీ నీరు చేరి అటవీ భూములు 864 ఎకరాలు, రెవెన్యూ భూములు 900, పట్టా భూములు 250 ఎకరాలు ముంపునకు గురవుతాయి.

 కాగా ఇందులో రెవెన్యూ, పట్టా భూములకు క్లియరెన్స్ వచ్చాయి. మరోవైపు మునుగుతున్న 864 ఎకరాల ఫారెస్ట్​ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరోచోట ల్యాండ్ కేటాయించింది. పెగడపల్లి మండలం నంచర్ల, దికొండ, ల్యాగలమర్రి, గొల్లపల్లి మండలం చందోళి గ్రామాల్లోని రెవెన్యూ భూములను పరిశీలిస్తున్నారు. భూములను గుర్తించి ఇరిగేషన్ డిపార్మెంట్కు అప్పగించాక ఫారెస్ట్ డిపార్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ప్రస్తుతం సర్కార్​ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయి పర్మిషన్లు వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందని అధికారులు చెబుతున్నారు. పర్మిషన్ రాగానే గేట్లు బిగించి నీటిని నిల్వ చేసేందుకు 
అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

15 రోజుల్లో పర్మిషన్ వచ్చే అవకాశం

రోళ్లవాగు ప్రాజెక్ట్​పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఫారెస్ట్ డిపార్మెంట్ నుంచి మరో 15 రోజుల్లో పర్మిషన్​వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే పనులు మొదలుపెట్టి మార్చి లోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. - చక్రునాయక్, డీఈఈ, రోళ్లవాగు ప్రాజెక్ట్