ఆరు రాష్ట్రాల్లో బర్డ్‌‌‌‌ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం

ఆరు రాష్ట్రాల్లో బర్డ్‌‌‌‌ ఫ్లూ.. హెచ్చరించిన కేంద్రం
కట్టడి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు బర్డ్‌‌‌‌ ఫ్లూ పాకిందని కేంద్రం వెల్లడించింది. కేరళ, రాజస్థాన్‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌, హిమాచల్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌, హర్యానా, గుజరాత్‌‌‌‌లలో ఫ్లూ ఉన్నట్టు కన్ఫామ్‌‌‌‌ చేసింది. హర్యానాలో పంచకులలోని పౌల్ట్రీ శాంపిళ్లలో, గుజరాత్‌‌‌‌లోని జునాగఢ్‌‌‌‌లో వలస వచ్చిన పక్షుల్లో, రాజస్థాన్‌‌‌‌లోని సవాయ్‌‌‌‌ మధోపూర్‌‌‌‌, పాలి, జైసల్మీర్‌‌‌‌, మొహర్‌‌‌‌ జిల్లాల్లోని కాకుల్లో ఫ్లూ ఉన్నట్టు కన్ఫామ్‌‌‌‌ అయిందని చెప్పింది. యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ప్రకారం వ్యాధిని కంట్రోల్‌‌‌‌ చేయాలని ఆ రాష్ట్రాలను ఆదేశించింది. ఢిల్లీలోని డీడీఏ పార్క్‌‌‌‌లోనూ 16 పక్షులు అనుమానాస్పదంగా చనిపోగా వాటి శాంపిళ్లను టెస్టింగ్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌కు పంపించారు. కేరళలో వ్యాధి సోకిన జిల్లాల్లో పక్షులను చంపేశారని, డిసిన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ నడుస్తోందని అధికారులు తెలిపారు. ఫ్లూ లేని రాష్ట్రాల్లో విజిలెన్స్‌‌‌‌ పెంచాలని సూచించామని వివరించారు. For More News.. ట్రంప్​కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు ట్రంప్‌కు ట్విట్టర్ షాక్.. అకౌంట్‌పై శాశ్వత నిషేధం ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది పిల్లలు మృతి