ఘనంగా బీరప్ప బండారు ఉత్సవం

ఊట్కూర్​, వెలుగు: మండలంలోని పెద్దజట్రం గ్రామంలో బీరప్ప, ఎల్లమ్మ బండారు ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పాలమూరు కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​​చల్లా వంశీచంద్​రెడ్డి చీఫ్ గెస్ట్​లుగా హాజరయ్యారు. వారికి ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికి, సన్మానించారు. ఎంపీగా వంశీచంద్​రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందాలని పూజారులు ఆశీర్వదించారు. మక్తల్  నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. 

గిరిజన సంక్షేమాన్ని విస్మరించిన్రు

పాలమూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్​ గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించిందని, పార్లమెంట్ భవన్  ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా అవమానించిందని కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ వంశీ చంద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్  పార్టీ ఆఫీస్​లో కాంగ్రెస్  ఆదివాసి విభాగం అధ్యక్షుడు లింగం నాయక్​ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వంశీచంద్​రెడ్డి మాట్లాడుతూ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఇందిరా గాంధీదేనని గుర్తు చేశారు. గిరిజన సంక్షేమానికి కాంగ్రెస్  ప్రభుత్వం కృషి చేస్తుందని, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్లు గోపాల్ నాయక్, గంగ్యా నాయక్, శేఖర్ నాయక్, రవి నాయక్, తులసీరాం పాల్గొన్నారు.