కరోనాతో పాటు అన్ని వైరస్‌‌లు ఖతం చేసే బయో స్టెర్ల్‌ ఎయిర్

కరోనాతో పాటు అన్ని వైరస్‌‌లు ఖతం చేసే బయో స్టెర్ల్‌ ఎయిర్
బయో స్టెర్ల్‌ ఎయిర్ సంక్రాంతి తర్వాత వస్తది కరోనాతో పాటు అన్ని వైరస్‌‌లు ఖతం రోగుల రికవరీ రేటు మెరుగవుతుంది సీసీఎంబీ కూడా ఆమోదం హైదరాబాద్, వెలుగు: నానో సుప్రీమ్ బయో స్టెరిలైజర్ మెషిన్ ‘బయో స్టెర్ల్ ఎయిర్‌‌‌‌’ను సంక్రాంతి పండుగ తర్వాత లాంచ్ చేయనున్నట్టు మాన్విస్ స్టూడియోస్(హెల్త్ బొటిక్) ప్రకటించింది. డాక్టర్ ఏవీ రావు ఇన్వెంట్ చేసిన ఈ మెషిన్‌‌ను మాన్విస్ స్టూడియోస్  తయారు  చేసింది. ఇది కరోనాతో పాటు అన్ని రకాల వైరస్‌‌లు, బ్యాక్టీరియాలు, ఫంగస్‌‌ల నుంచి మన ఇంటిని, ఆఫీసులను, హాస్పిటల్స్‌‌ను డిస్‌‌ఇన్‌‌ఫెక్ట్ చేస్తుంది. ఇది ప్లగ్ అండ్ ప్లే మెషిన్. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్లతో తాము మాట్లాడుతున్నట్టు కంపెనీ సీఓఓ సంకీర్త్ తెలిపారు. తెలంగాణ, ఏపీ, గుజరాత్‌‌లలో డిస్ట్రిబ్యూటర్లను నియమించినట్టు పేర్కొన్నారు. ప్రొడక్ట్‌‌ లాంచ్ అయిన తర్వాత దేశమంతా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రొడక్ట్‌‌ను గ్రామాలకు కూడా అందించనున్నామని, మండలాల్లో డిస్ట్రిబ్యూటర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. ఒక్క ఆర్డర్ వచ్చినా కూడా తాము డెలివరీ చేస్తామని అన్నారు. ఈ ప్రొడక్ట్‌‌ను రూమ్ సైజుల బట్టి డిజైన్ చేశారు. దీని కాస్ట్‌‌ రూ.11,349 నుంచి ప్రారంభమై, రూ.65,771 వరకు ఉంది. ఈ ప్రొడక్ట్‌‌ను కమర్షియల్ ఆఫీసులు, క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్లు, సర్జరీలు చేయించుకున్న వారు, పెద్ద వారు, హాస్పిటల్స్‌‌ను టార్గెట్‌‌గా చేసుకుని కంపెనీ రూపొందించింది. పదేళ్ల రీసెర్చ్ తర్వాత ఈ ప్రొడక్ట్‌‌ను మార్కెట్‌‌లోకి తెస్తోంది.  ఐసీయూలు, కరోనా పేషెంట్ల ఐసోలేషన్ వార్డ్స్‌‌లో ఈ ప్రొడక్ట్‌‌ను వాడేందుకు హాస్పిటల్స్ ఆసక్తి చూపుతున్నాయి. తమ స్టెరిలైజేషన్ మెషిన్‌‌తో పేషెంట్ల రికవరీ ఫాస్ట్‌‌గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. బ్యాక్టీరియాలు, వైరస్‌‌లు లేని స్వచ్ఛమైన గాలిని ఇది అందిస్తుండటంతో యాంటీ బయోటిక్స్ వాడకం తగ్గుతుందని పేర్కొంది. ఇమ్యూనిటీ సిస్టమ్‌‌ మెరుగవుతుందని తెలిపింది.  పది మంది కరోనా పేషెంట్లకు కూడా ఈ మెషిన్‌‌ను అందించినట్టు చెప్పింది. 48 గంటల్లో కరోనా వైరస్ సింప్టమ్స్ చాలా వరకు తగ్గాయని తెలిపింది.  ప్రస్తుతం ఈ ప్రొడక్ట్‌‌ యూఎస్‌‌ఎఫ్‌‌డీఏ వద్ద రిజిస్టర్ అయింది. పేటెంట్స్ రైట్స్ కూడా దరఖాస్తు చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఇది పూర్తిగా మేడిన్ తెలంగాణ ప్రొడక్ట్‌‌ అని సంకీర్త్ చెప్పారు. పేషెంట్లకు సురక్షితమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పదేళ్ల కిందటే దీన్ని తయారు చేయడం ప్రారంభించామని, అయితే ఇప్పుడిది కరోనా వైరస్‌‌ను నిర్మూలించేందుకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. For More News.. ఇంకో రెండు టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ల్లో ఆడతా