న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూపు మీడియా బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. రాఘవ్ బెహల్‌కు చెందిన డిజిటల్ బిజినెస్ న్యూస్ ప్లాట్‌ఫామ్ ‘క్వింటిలియన్ బిజినెస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’లో (క్యూబీఎం) మైనారిటీ వాటాను దక్కించుకుంది. అయితే ఈ డీల్ విలువ ఎంత అన్నది తెలియలేదు. ఇందుకోసం క్వింట్ డిజిటల్ మీడియాతో బైండింగ్ టర్మ్ షీట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.
