రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకుంటోంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

వికారాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని 40 లక్షల రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకుంటోందని, ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 63 వేల నుంచి రూ. 75 వేల వరకు ఖర్చు చేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.  ఆదివారం వికారాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో  420 హామీల విఫలమైందుకు నిరసనగా బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. 

ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి  జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, దిశా కమిటీ సభ్యులు వడ్ల నందు, డాక్టర్ రాజశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సదానంద్ రెడ్ది, దరూర్ పీఎసీఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ రాజు నాయక్, కోట్​పల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్​రెడ్డి, నాయకులు వివేకానందరెడ్డి, నరోత్తంరెడ్డి, పాండుగౌడ్​ పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీల పేరుతో  66 మోసాలు

సికింద్రాబాద్ : ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​66 రకాలుగా ప్రజలను మోసం చేసిందని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ ఆరోపించారు. సికింద్రాబాద్ లో ‘ఆరు గ్యారెంటీలు..66 మోసాలపై చార్జీ షీట్’ పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, కార్పొరేటర్ చీర సుచిత్ర, రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, వంశీ తిలక్, పెద్ది రవీందర్, ఆకారపు రమేశ్, హరి, నాగేశ్వర్ రెడ్డి, అంబాల రాజేశ్వర్, శ్రీశైలం పాల్గొన్నారు.