లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు సజీవ దహనం

లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు సజీవ దహనం
అనంతపురం: జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం ఎంగిలిబండ దగ్గర 44వ నెంబరు జాతీయ రహదారిపై లారీని బైకు ఢీకొట్టింది. వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో బైకులోని పెట్రోల్ లీక్ అయింది. దీంతో వెంటనే మంటలు అంటుకున్నాయి.  బైకుపై నుండి ఎగిరిపడిన వారిపై పెట్రోల్ పడడంతో మంటలు వ్యాపించి క్షణాల్లో సజీవ దహనం అయ్యారు. మృతులు నారాయణరెడ్డి(45), రోషిరెడ్డి(65) గా గుర్తించారు.  లారీ కూడా కాలిపోయింది. బాట సుంకలమ్మ దగ్గర శుభకార్యానికి వెళ్లి బైకుపై తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తాడిపత్రి వైపు నుండి వస్తున్న లారీని ఎదురుగా వెళ్లి టూవీలర్ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.