బిజినేపల్లి మండలంలో..వైభవంగా వెంకన్న కల్యాణం

కందనూలు, వెలుగు : బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి 38వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూల్  ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కాంగ్రెస్  ఎంపీ క్యాండిడేట్​ మల్లు రవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్​ పార్టీ నాయకులు ఎంపీ క్యాండిడేట్​కు మద్దతుగా తిమ్మాజిపేట నుంచి వేంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో డెవలప్​ చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ నెల 30 నుంచి బూత్​ లెవల్​ మీటింగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. అనంత నరసింహారెడ్డి, సందడి ప్రతాప్ రెడ్డి, పాండురంగా రెడ్డి, శ్రీనివాసులు, అమృతరెడ్డి పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయంలో హోలీ సందర్భంగా సోమవారం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలోని శివలింగానికి పంచామృతాభిషేకం జరిపించారు. ప్రధాన అర్చకుడు వరదరాజన్  అయ్యంగార్, రవీందర్, రాములు, మల్లేశ్, యాదగిరి, రమాదేవి, శారద, మన్నెపు రెడ్డి, శివ, రాజు, చారి పాల్గొన్నారు.