దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. మొదటి విడతలో కరోనా వారియర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. ఇవాళ్టి (సోమవారం) నుంచి 60 ఏళ్లకు పైబడిన వారందరికీ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ను ఫ్రీగా వేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వాళ్లు మాత్రం రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని…ఆస్పత్రులకు రూ.250 చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
బీహార్ ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామని నితీశ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆయన నిర్ణయం తీసుకున్నారు. నితీశ్ నిర్ణయంపై బీహార్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
