బిహార్ లో పంచాయతీ వార్డ్ సెక్రటరీలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. తమ డిమాండ్ల సాధన కోసం పట్నాలో బీజేపీ ఆఫీస్ ముట్టడించేందుకు పంచాయతీ వార్డ్ సెక్రటరీలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పంచాయతీ సెక్రటరీలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టారు. మహిళా సెక్రటరీలపై వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
#WATCH | Bihar: Ruckus between Panchayat ward secretaries & Bihar Police witnessed outside the BJP office in Patna; many Panchayat ward secretaries had come to gherao the BJP office with their demands pic.twitter.com/mJ3DCm98C0
— ANI (@ANI) December 27, 2021
