డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

 డిప్యూటీ సీఎంలతో సహా నలుగురు మంత్రులకు కరోనా

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బుధవారం బీహార్ క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్ సమావేశానికి ముందు 
సీఎం  కార్యాలయం  దగ్గర కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో డిప్యూటీ సీఎంలు రేణుదేవి, తార్ కిషోర్ ప్రసాద్‌తో సహా నలుగురు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు కరోనా పరీక్ష తప్పనిసరి చేయడంతో మంత్రులందరూ పరీక్షలు చేయించుకున్నారు.

ఇందులో  ఇద్దరు డిప్యూటీ సీఎంలు, మరో మత్రులకు కరోనా నిర్దారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన మంత్రుల్లో  ఎక్సైజ్ మంత్రి సునీల్ కుమార్,భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరిలు ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చేసింది