హైదరాబాద్, వెలుగు: బిగ్ సీ తన మొదటి స్టోర్‌ను తీసుకొచ్చి గురువారంతో 19 ఏళ్లు పూర్తయ్యింది. కంపెనీ 2002 లో తమ మొదటి స్టోర్‌ను విజయవాడలో ఏర్పాటు చేసింది. అప్పటికి మొబైల్ ఫోన్ మార్కెట్ 4 శాతం కంటే తక్కువగానే ఉందని బిగ్ సీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. గత 19 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో 250 కి పైగా స్టోర్లను ఏర్పాటు చేశామని కంపెనీ ఎండీ బాలు చౌదరి అన్నారు. మొత్తం 5 కోట్ల మంది కస్టమర్లకు సేవలందించామని చెప్పారు. ప్రస్తుతం ఆర్డర్ పెట్టిన 90 నిమిషాల్లోనే మొబైల్ ఫోన్‌ను డెలివరీ చేస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది కాలంలో టైర్ 4, 5 పట్టణాల్లో కూడా విస్తరించాలని బిగ్ సీ చూస్తోంది. ఈ పట్టణా ల్లో 100 స్టోర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచీలు, వీటికి సంబంధించిన యాక్ససరీలను బిగ్ సీ అమ్ముతోంది. 19 వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ స్టోర్లలో కొనుగోలు చేసిన వారికి వివిధ ఆఫర్లను అందిస్తున్నారు.
