ఆన్‌లైన్ సూపర్‌మార్కెట్ బిగ్‌బాస్కెట్ బుధవారం నుంచి బిగ్ 47 సేల్‌ను మొదలుపెడుతోంది. ఈ సందర్భంగా 500లకుపైగా వస్తువులపై కనీసం 47 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. పళ్లు, కూరగాయలు, పప్పులు, పర్సనల్ కేర్, బ్రాండెడ్ స్నాక్స్, కాస్మెటిక్స్, కిచెన్ వస్తువులపై 12 రోజులపాటు తగ్గింపులు ఉంటాయని తెలిపింది. ప్రాక్టర్ అండ్ గాంబిల్, డాబర్, ఐటీసీ వంటి బ్రాండెడ్ ప్రొడక్టులపైనా డిస్కౌంట్లు ఉంటాయని బిగ్‌బాస్కెట్ పేర్కొంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బిగ్ 47 సేల్‌ను నిర్వహిస్తామని ఈ స్టార్టప్ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. దేశవ్యాప్తంగా 26 నగరాలకు తాము డెలివరీలను ఇస్తున్నామని చెప్పారు.

