అమ్రాబాద్, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో శనివారం సాయంత్రం సఫారీ రైడ్ చేస్తున్న వారికి పెద్దపులి కనిపించడంతో సెల్ఫోన్లలో బంధించారు. సఫారీ రైడ్‌లో భాగంగా వీరు ప్రయాణిస్తున్న వాహనం పరహాబాద్ సమీపంలోకి చేరుకోగానే ఓ పొదలో నుంచి బయటకు వచ్చిన పెద్దపులి రోడ్డును దాటుకుంటూ మరోవైపు వెళ్లింది. దీంతో పర్యాటకులు ఆశ్చర్యపోయారు.
ఏటీఆర్లో 36 పులులు ఉన్నాయి. ఇవి దట్టమైన అటవీ ప్రాంతాల్లో తిరుగుతుంటాయి. పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో కనిపించడం చాలా అరుదు. గతంలో మహారాష్ట్రలోనే ఇలాంటి దృశ్యాలు కనిపించగా, తాజాగా అమ్రాబాద్లోనూ పులి కనిపించడంపై అటవీ శాఖ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.