ఆప్​కు మద్దతివ్వడం మేం చేసిన పెద్ద తప్పు

  • కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తుపై కాంగ్రెస్ నేత, ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2013 ఎన్నికల్లో 40 రోజుల పాటు ఆప్‌‌ కు మద్దతివ్వడం కాంగ్రెస్‌‌ చేసిన తప్పని తెలిపారు. దీని వల్ల ఢిల్లీలో కాంగ్రెస్‌‌ బలహీనపడిందని చెప్పారు. ఆప్, బీజేపీని లక్ష్యంగా చేసుకుని 12 పాయింట్లతో ఢిల్లీ కాంగ్రెస్ ‘వైట్ పేపర్’ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘దేశం మొత్తంలో మోసగాళ్లకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది కేజ్రీవాలే. అందుకే కేజ్రీవాల్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన ‘వైట్ పేపర్’ ను విడుదల చేశాం” అని అజయ్ మాకెన్ పేర్కొన్నారు.