హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ఫోన్లను అమ్మే బిగ్ సీ ఆషాడ మాసం సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1,999 విలువైన గిజ్మోర్ ఇయర్‌బడ్స్‌ను రూ. 99కే అందిస్తోంది. లేదా రూ. 3,999 విలువైన గిజ్మోర్ స్మార్ట్‌వాచ్‌లను రూ. 499కే ఇస్తోంది. తమ దగ్గర స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు కొనేవారికి సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండానే ఫైనాన్స్ లభిస్తుందని బిగ్ సీ సీఎండీ యం బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్ కేవలం బిగ్ సీ లోనే దొరుకుతోందని అన్నారు. వీటితో పాటు ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫింగర్స్ బార్ స్పీకర్‌ను కేవలం రూ.2,999 కే ఇస్తున్నామని వివరించారు. ప్రతి ల్యాప్‌టాప్ కొనుగోలుపై ఒక ఈఎంఐ, ల్యాప్‌టాప్ బ్యాగ్, యారో హెడ్‌సెట్‌ను బిగ్ సీ ఫ్రీగా ఇస్తోంది. బ్రాండెడ్ యాక్ససరీలపై 5 % వరకు డిస్కౌంట్‌ను, ఎస్బీఐ ద్వారా మొబైల్స్ కొంటే 5 % వరకు క్యాష్ బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. మొబిక్విక్ ద్వారా మొబైల్స్ కొనేవారికి 5 % వరకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్‌ను, ఐఫోన్ మొబైల్స్ కొనేవారికి రూ. 4 వేల వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. శామ్సంగ్, వివో, ఎంఐ మొబైల్స్‌పై కూడా భారీగా క్యాష్ బ్యాక్లను ఇస్తోంది.
