సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కార్లను అమ్మే బిగ్ బాయ్ టాయ్జ్ (బీబీటీ) ఆన్లైన్లో వింటేజ్, క్లాసిక్ కార్లను వేలం వేయనుంది. ఈ ప్రాసెస్ ఆదివారం మధ్యాహ్నం 12.00 నుంచి స్టార్టవుతుంది. రోల్స్ రాయ్స్, బెంట్లీ, కాడిలాక్, ఆస్టిన్, ల్యాండ్ రోవర్, బుయిక్, మెర్సిడెస్, చెవర్లట్ వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన కార్లను వేలానికి పెట్టనున్నారు. మొదటగా ఫోక్స్‌వ్యాగన్ బీట్లీ 1960 మోడల్‌ను ఆక్షన్ వేయనున్నారు. ఈ కారు కోసం ఆక్షన్ రూ. 1 నుంచి స్టార్టవుతుంది. ఎటువంటి రిజర్వ్ ప్రైస్ లేదు. వచ్చే నెల 8 , మధ్యాహ్నం 3 లోపు ఆక్షన్ రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. ఈ వేలంలో పాల్గోవాలనుకునే వారు ప్రీమియం ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ రూ. లక్ష డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
