వాషింగ్టన్: అమెరికా రక్షణ శాఖలో ఇండో అమెరికన్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ.. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. డిఫెన్స్ మినిస్ర్టీలో డిప్యూటీ అండర్ సెక్రటరీ (అక్విజిషన్, సస్టైన్మెంట్)గా రాధా అయ్యంగార్ను ఆయన నియమించారు. ప్రస్తుతం ఆమె డిఫెన్స్ డిప్యూటీ సెక్రటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పని చేస్తున్నారు. దీనికి ముందు గూగుల్‌లో రీసెర్చ్ అండ్ సేఫ్టీ డైరెక్టర్‌గా ఉన్నారు. బిజినెస్ అనలైటిక్స్, డేటా సైన్స్‌తో పాటు టెక్నికల్ రీసెర్చ్‌లో క్రాస్ ఫంక్షనల్ టీం లీడర్‌గా పని చేశారు. ఫేస్బుక్లో పాలసీ అనలైసిస్ గ్లోబల్‌హెడ్‌గా కూడా జాబ్ చేశారు. అమెరికా డిఫెన్స్ శాఖలో నేషనల్సె క్యూరిటీ, విద్యుత్ శాఖలో సీనియర్ స్టాఫ్‌గా కూడా పని చేశారు. వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం పెట్టుకుని రక్షణ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
