IPL 2025 Mega Action: సన్ రైజర్స్‌కు బై బై.. రూ.10.75 కోట్లకు టాప్ ప్లేయర్‌ను పట్టేసిన ఆర్‌సీబీ

ఐపీఎల్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు భారీ ధర పలికింది. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. తొలి రోజు వేలాన్ని నిరాశగా ముగించిన ఆర్సీబీ రెండో రోజు మాత్రం భారత స్వింగ్ బౌలర్ ను పట్టేసింది. భువనేశ్వర్ కోసం ఎక్కడా రాజీపడలేదు బెంగళూరు. అతని కోసం ఎన్ని జట్లు పోటీకి వచ్చినా తగ్గేదే లేదన్నట్టు కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజల్ వుడ్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీకి భువీ రాక బలాన్ని పెంచుతుంది.     

2024 ఐపీఎల్ సీజన్ లో భువీ సన్ రైజర్స్ తరపున ఆడాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను హైదరాబాద్ జట్టును వీడి బయటకు రావడం ఇదే తొలిసారి. కొన్నేళ్లుగా సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఈ భారత ఫాస్ట్ బౌలర్ ను రిటైన్ చేసుకోవడానికి హైదరాబాద్ జట్టు ఆసక్తి చూపించలేదు. దీంతో మెగా ఆక్షన్ లో ఈ స్వింగ్ కింగ్ భారీ మొత్తాన్ని సంపాదించాడు. 

Also Read : టీమిండియాపై విధ్వంసం.. సఫారీ ప్లేయర్‌కు జాక్ పాట్