అబద్ధాన్ని నిజం చేయటానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు... భూమన

ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రేపిన రాజకీయ దుమారం ఇంకా సద్దుమనగలేదు. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దానికి దారి తీసిన ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. టీటీడీ మాజీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ ( సెప్టెంబర్ 30, 2024 ) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అబద్దాన్ని నిజం చేయటానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారతారని అన్నారు.

ALSO READ | తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం ప్రశ్నల వెల్లువ.. భక్తుల మనోభావాలతో ఆటలొద్దంటూ సీరియస్..

ఆ దేవదేవుడే ధర్మాసనం రూపంలో వచ్చి నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టే దైర్యంగా ప్రమాణం చేశామని అన్నారు. ఆలస్యంగానైనా నిజం నిగ్గు తేలుతుందని అన్నారు. ఎటువంటి విచారణ కానీ, సిట్ ఏర్పాటు కానీ జరగకముందే.. చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందని అన్నారు. దేవుడిని రాజకీయాల కోసం వాడుకోవద్దని సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని అన్నారు.