భుజంగరావు మధ్యంతర బెయిల్​ పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో మూడో నిందితుడైన మాజీ అదనపు ఎస్పీ ఎన్‌‌‌‌‌‌‌‌. భుజంగరావుకు ఈ నెల 23వ తేదీ వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ సోమవారం హైకోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ కేసులో కింది కోర్టులో భుజంగరావు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ బెయిలు పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయడంతో మధ్యంతర బెయిలు పిటిషన్‌‌‌‌‌‌‌‌ను పొడిగిస్తూ జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. సుజన ఉత్తర్వులిచ్చారు.

 ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలన్న భుజంగరావు అభ్యర్థనను నవంబరు 11న నాంపల్లి కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు పొందారు.