ఆధిక్యంలో ఇండియా‌‌‌‌- డి

అనంతపూర్‌‌‌‌‌‌ : ఇండియా–బితో జరుగుతున్న దులీప్‌‌‌‌ ట్రోఫీలో ఇండియా–డి 311 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. రికీ భుయ్‌‌‌‌ (90 బ్యాటింగ్‌‌‌‌), శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (50) చెలరేగడంతో.. శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు ఇండియా–డి రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 44 ఓవర్లలో 244/5 స్కోరు చేసింది. రికీతో పాటు ఆకాశ్‌‌‌‌ (28 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. దేవదుత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ (3), శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌ (2), నిశాంత్‌‌‌‌ సింధు (5) ఫెయిలయ్యారు. 

రికీ, శ్రేయస్‌‌‌‌ నాలుగో వికెట్‌‌‌‌కు 75 రన్స్‌‌‌‌ జత చేశారు. ముకేశ్‌‌‌‌ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు 210/6 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా–బి తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 76.2 ఓవర్లలో 282 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సుందర్‌‌‌‌ (87) రాణించాడు. సౌరభ్‌‌‌‌ కుమార్‌‌‌‌ 5 వికెట్లు తీశాడు. 

333 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఇండియా–ఎ

రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ (73), శాశ్వత్‌‌‌‌ రావత్‌‌‌‌ (53) హాఫ్‌‌‌‌ సెంచరీలు సాధించడంతో.. ఇండియా–ఎ జట్టు కూడా భారీ ఆధిక్యంలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌కు ఇండియా–ఎ రెండో ఇన్నింగ్స్‌‌‌‌లో 64 ఓవర్లలో 270/6 స్కోరు చేసింది. కుమార్‌‌‌‌ కుశాగ్ర (40 బ్యాటింగ్‌‌‌‌), తనుష్‌‌‌‌ కొటియాన్‌‌‌‌ (13 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (34) ఫర్వాలేదనిపించినా, తిలక్‌‌‌‌ వర్మ (19) విఫలమయ్యాడు. 

ప్రస్తుతం ఇండియా–ఎ 333 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉంది. అంతకుముందు 216/7 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా–సి 71 ఓవర్లలో 234 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. పుల్‌‌‌‌కిత్‌‌‌‌ నారంగ్‌‌‌‌ (41) పోరాడాడు. అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, అకీబ్‌‌‌‌ ఖాన్‌‌‌‌ చెరో మూడు వికెట్లు తీశారు.