Virat Kohli: కోహ్లీ పుట్టినరోజు.. టపాసులు కాల్చి వేడుకలు జరిపిన పోలీసులు

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. 1988 న‌వంబ‌ర్ 5న ప్రేమ్‌నాథ్ కోహ్లీ, స‌రోజ్ దంపతులకు జన్మించిన విరాట్ మంగళవారం 35 ఏళ్లు పూర్తి చేసుకొని.. 36వ వ‌సంతంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అతనికి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. 

ఈ క్రమంలో భోపాల్ పోలీసులు ఘనంగా కోహ్లీ పుట్టినరోజు వేడుకలు జరిపారు. బాణసంచాకాలుస్తూ కోహ్లి చిత్రంతో అలంకరించబడిన కేక్‌ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కేక్‌ కట్ చేసి సమయంలో సదరు పోలీస్ అధికారి సైతం భారత క్రికెటర్ జెర్సీ ధరించి ఉండటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

పూరి తీరంలో సైకతశిల్పం..

ఇదిలావుంటే, కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌.. పూరి(ఒడిశా) సాగర తీరంలో కోహ్లీ సైకత శిల్పం రూపొందించారు. క్రికెట్‌ మైదానంపై విరాట్‌ ఉన్నట్లు ఎంతో చక్కగా రూపొందించారు. బ్యాట్‌పై హ్యాపీ బర్త్‌డే విరాట్‌ అని రాసుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను ఆయనే నెట్టింట పోస్ట్ చేశారు.