బీహెచ్ఎల్ రామచంద్రపురంలో ఘనంగా విజిలెన్స్​ వారోత్సవాల ముగింపు

రామచంద్రాపురం, వెలుగు:  బీహెచ్ఎల్ రామచంద్రపురంలో గతనెల 28 న ప్రారంభించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాలకు ఆదివారం ముగింపు పలికారు. 'సమగ్రతా సంస్కృతితో దేశ శ్రేయస్సు' అనే థీమ్ తో ఈ వారోత్సవాలు జరిగాయని ఈడీ శ్రీనివాస్​రావు తెలిపారు. బల్క్ మెస్సేజ్​లు, బ్యానర్ల ద్వారా  ప్రజలకు ఈ వారోత్సవాల గురించి అవగాహన కల్పించినట్లు చెప్పారు.

సమీపంలోని స్కూళ్లు, కాలేజీల్లో ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలను బహుమతులతో సత్కరించినట్లు పేర్కొన్నారు. వారోత్సవాల ముగింపులో భాగంగా 3కె వాకథాన్ నిర్వహించి కార్యక్రమాన్ని ముగించినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్​వోలు, ఉద్యోగులు పాల్గొన్నారు.