న్యూఢిల్లీ,వెలుగు: నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) మెంబర్‌గా సీనియర్ అడ్వకేట్, సామాజిక వేత్త విజయ భారతి సాయని గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా పాల్గొని ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా విజయ భారతి మాట్లాడుతూ.. తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు చెప్పారు.
దేశంలోని పౌరుల హక్కుల కోసం శక్తి వంచన లేకుండా, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని తెలిపారు. కాగా, ఏపీకి చెందిన విజయ భారతి.. తెలంగాణలో దాదాపు మూడు దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తిలో సేవలందిస్తున్నారు.
