జనవరి 2.. భారతరత్న ప్రారంభించిన రోజు .. తెలుసుకోవాల్సిన విశేషాలు

భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రారంభించిన రోజు జనవరి 2. భారతరత్న ప్రారంభించి ఇప్పటికి సరిగ్గా 71 ఏండ్లు. 1954 జనవరి 2న ప్రారంభమైన ఈ అత్యున్న పురస్కారం ఇప్పటి వరకు దేశానికి అత్యుత్తమ సేవ చేసిన వారికి అందిస్తూ వస్తున్నారు. 

ప్రారంభించిన నాటి నుండి భారతరత్న ప్రతి ఏడాది ముగ్గురికి ప్రదానం చేస్తారు. అయితే 2024లో ప్రత్యేకంగా ఆ సంప్రదాయానికి బ్రేక్ చెప్పి 5 మందికి అందించారు. 

మొదటి నుండి నిర్విరామంగా ఇచ్చిన పురస్కారాన్ని ఎమర్జెన్సీ సమయంలో 1977 నుంచి 1980 మధ్య కాలంలో ఆపేశారు. అదేవిధంగా రాజ్యాంగపరమైన వ్యాజ్యాల కారణంగా ఆగస్టు 1992 - నుంచి డిసెంబర్ 1995 వరకు మరోసారి సస్పెండ్ చేశారు. 

మొట్టమొదటి అవార్డు బ్రిటిష్ ప్రభుత్వంలో గవర్నల్ జనరల్ గా పనిచేసిన సి.రాజగోపాలాచారికి, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్, భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ కు ప్రదానం చేశారు. 

ఇటీవల 2024లో సంప్రదాయానికి భిన్నంగా ఐదుగురికి ప్రదానం చేశారు. 2024లో పురస్కారం పొందిన వారిలో కర్పూరి ఠాకూర్, ఎల్.కె.అద్వానీ, పి.వి.నరసింహారావు, చరణ్ సింగ్, ఎమ్.ఎస్.స్వామినాథన్ లకు ప్రదానం చేశారు.