12 ఏండ్లు దాటినోళ్లకు కొవ్యాగ్జిన్, 18 ఏండ్లు పైబడినోళ్లకు కొవిషీల్డ్

12 ఏండ్లు దాటినోళ్లకు కొవ్యాగ్జిన్, 18 ఏండ్లు పైబడినోళ్లకు కొవిషీల్డ్
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవ్యాగ్జిన్ ను12 ఏండ్లు పైబడిన పిల్లలకు, సీరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ ను 18 ఏండ్ల పైబడిన వారికి వేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. రెండు వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడేందుకు జనవరి 3న డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఆధ్వర్యంలోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రికమండేషన్స్ అధారంగా వ్యాక్సిన్లకు డీసీజీఐ సోమాని అనుమతి ఇచ్చారు. ఆ రెండు టీకాలనూ రెండు డోసుల్లో ఇస్తారన్నారు. అయితే కొవ్యాగ్జిన్ ట్రయల్స్ 3వ స్టేజ్లో ఉండగానే అనుమతివ్వడంపై విమర్శలొచ్చాయి. దీనిపై స్పందించిన డీసీజీఐ.. వ్యాక్సిన్లు 110 శాతం సేఫ్ అని స్పష్టం చేశారు. కాగా, కొవిషీల్డ్ డోసులను ప్రభుత్వానికి రూ. 200కు అమ్ముతామని, తర్వాత రేటు పెంచుతామని సీరమ్ సీఈవో పునావాలా తెలిపారు. మార్కెట్లో రూ. 1,000కి అమ్ముతామన్నారు.