విదేశీ సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ల కంటే తమ కొవాగ్జిన్ చాలా ఉత్తమమైనదన్నారు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా. కొవాగ్జిన్ పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కొవాగ్జిన్ బ్యాకప్ వ్యాక్సిన్ కాదని స్పష్టం చేశారు. ప్రతీసారి భారత కంపెనీలే టార్గెట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ ను రాజకీయం చేయొద్దని… తమ కుటుంబానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. మా ఓన్ రిస్క్ తో వ్యాక్సిన్ తయారీకి ముందుకు వచ్చామన్నారు. భారత్ లో ఒక టీకా అనుమతి పొందాలంటే ఎన్నో స్టేజ్ లు దాటాలన్నారు. టీకాను అందుబాటులోకి తేవడానికి ఎంతో కష్ట పడ్డామన్నారు.
ఇండియాలో వ్యాక్సిన్ తయారు చేస్తామని ముందుకు వచ్చిన మొదటి కంపెనీ తమదేనన్నారు. చాలా నిజాయతీగా వ్యాక్సిన్ ట్రయిల్స్ కొనసాగుతున్నాయన్నారు. టీవీలలో ఏదీపడితే అది మాట్లాడుతున్నారని..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు డబ్బు ఇవ్వలేదన్నారు. ఇతర దేశాలలో వ్యాక్సిన్లను ప్రశ్నించారు కానీ.. దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ ను ఎందుకు తక్కువ చేస్తున్నారన్నారు. ఇతర వ్యాక్సిన్స్ తో పోల్చితే అతి తక్కువ గా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది కోవాగ్జిన్ అన్నారు.
