TTD ఉద్యోగులు వెళ్లే దారిలో కేటీఆర్‌ను ఎలా అనుమతించారు

TTD ఉద్యోగులు వెళ్లే దారిలో కేటీఆర్‌ను ఎలా అనుమతించారు

TTD ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి. రూల్స్ కు విరుద్ధంగా వ్యవరిస్తున్నారంటూ ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి రోజు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్ ద్వారా అనుమతించడంపై ప్రశ్నించారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు,  సహా ప్రముఖులందరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండగా మంత్రి కేటీఆర్ ను మాత్రం మహాద్వారం ద్వారా ఎవరి ఆదేశాలతో అనుమతించారో  రేపు ఉదయం లోపు శ్రీవారి భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆలయ సంప్రదాయాలును కాపాడవలసిన బాధ్యత సీఎంపై వుందన్నారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులును కంపార్టుమెంట్లలో వేచివుండేలా చేసి….కేటీఆర్ ను మాత్రం ముందుగానే ఆలయంలోకి ఎలా తీసుకువెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న(సోమవారం) వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలును వెల్లడించాలన్నారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ కుంటుంబాన్ని బయోమెట్రిక్ ద్వారా ఆలయoలోకి వెళ్లే CCTV ఫుటేజ్ ను TTD అధికారులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి . ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.