RAPO22: సాగర్ గాడి లవ్వు మహాలక్ష్మి.. కాలేజ్ స్టూడెంట్స్గా రామ్, భాగ్యశ్రీ

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు దీనికి దర్శకుడు. ఇందులో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా, బుధవారం భాగ్యశ్రీ క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇందులో ఆమె మహాలక్ష్మి అనే పాత్రలో కనిపించబోతోంది. ‘మన సాగర్ గాడి లవ్వు... మహా లక్ష్మి’ అంటూ హీరోహీరోయిన్స్‌‌ జంటగా ఉన్న పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  కాలేజ్ స్టూడెంట్‌‌గా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌‌లో కనిపించింది భాగ్యశ్రీ. రామ్ క్యూట్ ఎక్స్‌‌ప్రేషన్స్ ఆకట్టుకున్నాయి.

రామ్ కెరీర్‌‌‌‌లో ఇది 22వ సినిమా. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇటీవల హైదరాబాద్‌‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు.