Good Health : నీరసంగా ఫీలవుతున్నారా.. ఈ ఫుడ్ తీసుకోండి.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఉంటారు..!

వెలుగు, లైఫ్: చిన్న పనికే నీరసం అనిపిస్తుందా.. కాసేపు వర్క్ చేశాక ఏదో ఒళ్లంతా అలసిపోయినట్లు అనిపిస్తుందా..? ఎప్పుడు ఫ్రెష్ గా, యాక్టివ్ గా, నీరసం లేకుండా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి.. అనే ప్రశ్నలు మీకు ఎప్పుడూ వస్తుంటాయి కదా. ఈ బిజీ లైఫ్ లో యాక్టివ్ గా ఉండేందుకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో, నీరసాన్ని ఎలా తగ్గించుకోవాలో వెలుగు లైఫ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆలస్యం ఎందుకు.. చదవండి మరీ. 

ఉద్యోగం చేస్తున్న మహిళలే కాదు, ఇంట్లో ఉండే స్త్రీలకూ పని ఎక్కువే. దాంతో ఆహారం మీద శ్రద్ధ పెట్టరు. అందువల్ల నలభై ఏళ్ళు దాటితే నీరసం అంటుంటారు. బరువు పెరగడం, పొట్ట దగ్గర కొవ్వు చేరడంతో వయసుకు మించి కనిపిస్తున్నామని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లు ఆహారంపై కొద్దిగా దృష్టి పెడితే చాలు బరువుతోపాటు, శరీరంలో చేరే అధిక కొవ్వును కూడా తగ్గించుకోవచ్చు అంటున్నారు న్యూట్రీషియన్స్. 

Also Read:-క్యాబేజీ తింటే కొన్ని క్యాన్సర్లు రావు..

అదెలా అంటే.. రోజూ తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మజ్జిగన్నం, పళ్ల రసాలు.. రాగులు, ఓట్సుతో చేసిన జావలు తాగితే తేలిగ్గా జీర్ణమవుతాయి. శరీరానికి కావల్సిన శక్తి వెంటనే అందుతుంది. నీరసం అనిపించదు. 

ఎంత పని ఉన్నా నీళ్లు ఎక్కువ తాగుతుండాలి. ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం లేదా బాదం పప్పులు తీసుకోవడం వల్ల శరీరాని శక్తి అందుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. ప్రతిరోజూ తప్పకుండా తొమ్మిది గంటల లోపు టిఫిన్ తినాలి. పదకొండు గంటలకు ఓట్స్,  జొన్నలు లేదా రాగులతో చేసిన జావ తాగాలి. ఒంటిగంటకల్లా భోజనం చేయాలి. 

అలాగే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోగా, అంటే నాలుగు, నాలుగన్నరకల్లా పండ్ల రసం లేదా టీ తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉంటుంది. వాటితోపాటు ఇంట్లో చేసిన స్నాక్స్ తినొచ్చు. రాత్రి భోజనం కూడా ఆలస్యం కాకుండా తొమ్మిది గంటలకల్లా పూర్తిచేయాలి. అలాగే రోజుకు ఒక గుడ్డు తింటే మంచిదని ఆహార నిపుణులు చెప్తున్నారు.
-- V6 వెలుగు లైఫ్