చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. ఈ నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా పోషకాహార లోపంతో పాటు విటమిన్ -డి తక్కువ కావడం. దీంతో బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. విటమిన్- డి ఉన్న ఆహారం తీసుకుంటే బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి. విటమిన్- డి ఉన్న ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం...
పాలు
పాలలో విటమిన్- డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. పాలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బ్యాక్ పెయిన్, ఇతర నొప్పులను తగ్గించుకోవచ్చు. చీజ్ లోనూ కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా లభిస్తాయి. చీజ్ తినడం వల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. దీంతో అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి.
Also Read :- మీ బంగారం నగలను.. ఇంట్లోనే ఇలా శుభ్రం చేసుకోండి
చేపలు
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు విటమిన్- డి కూడా లభిస్తుంది. కాబట్టి వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకుంటే శరీరానికి విటమిన్ -డి సరిగ్గా అందుతుంది. అంతేకాదు ఎముకలు. దృఢంగా మారి బ్యాక్ పెయిన్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కోడిగుడ్లు
కోడిగుడ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్ డి ఆరు శాతం లభిస్తుంది. కోడిగుడ్డు పచ్చసొనలోనే విటమిన్ డి ఉంటుంది. కాబట్టి పచ్చసొన తప్పకుండా తింటే. దీంతో బ్యాక్ పెయిన్ సమస్యకు దూరం కావొచ్చు.
-- V6 వెలుగు