తలుపులు తీసి ఏం పనులు అవి.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన ఇంటి ఓనర్

తలుపులు తీసి ఏం పనులు అవి.. పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన ఇంటి ఓనర్

ఇంట్లో అద్దెకుండే వారికి, ఇంటి ఓనర్లకు గొడవలు రావటం సాధారణం.. కానీ బెంగుళూర్‭లో ఓ ఇంటి ఓనర్ కు, అద్దెకుండేవారికి మద్య జరిగిన వివాదం అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్.. ఇంకా కోర్టు వరకు వెళ్లింది. కొత్తగా పెళ్లైన ఓ జంట తలుపుల బార్లా తెరుచుకుని రాసలీలలుకు పాల్పడుతున్నారని ఆ ఇంటి ఓనర్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దక్షిణ బెంగళూరులోని గిరినగర్‌లోని అవలహల్లికి చెందిన 44 ఏళ్ల మహిళ కొత్తగా పెళ్లైన వధువరులకు ఇల్లు రెంట్‪కు ఇచ్చారు. అయితే వారు తరుచూ కిటికీలు, తలుపులు తెరిచిఉంచే శృంగార కార్యకలాపాలు చేస్తున్నారని.. అది ఇంటి యజమానికి ఇంబ్బందికరంగా ఉందని పలుమార్లు వారిని హెచ్చరించిందట. అయినా వారు పట్టించుకోకపోవట్లేదని గిరినగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

Also Read :PF డబ్బులు అడిగితే పడుకోమన్నాడు

అయితే ఇంటి ఓనర్ కావాలనే తమపై అలా ఫిర్యాదు చేసిందని,  ఎప్పుడూ అద్దెకుండేవారితో ఓనర్ గొడవ పడాలని చేస్తుంటారని నూతన వధువరులు ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా అద్దెకు ఉండేవారు కూడా ఓనర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంటిని ఖాళీ చేయించాలని ఓనర్ కావాలనే చిన్న చిన్న విషయాలకు వాగ్వాదానికి దిగుతారని పలు సెక్షన్లపై ఇంటి యజమానిపై కేసు పెట్టారు. ఇద్దరి కేసులు ఎఫ్ఐఆర్ అయి కోర్టుకు వెళ్లాయి.