మిగతా నగరాల కన్నా బెంగళూరులోనే ఎక్కువ జీతాలు!

మిగతా నగరాల కన్నా బెంగళూరులోనే ఎక్కువ జీతాలు!
  • జానియర్, మిడ్, సీనియర్​ స్థాయిలలో టాప్
  • ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ జీతాలు
  • రాండ్‌‌స్టాడ్ రిపోర్ట్

న్యూఢిల్లీ: దేశంలో ఇతర సిటీలతో పోలిస్తే బెంగళూరులోనే  అధికంగా జీతాలందుతున్నాయని  ఓ నివేదిక గురువారం తెలిపింది. ఇండస్ట్రీల పరంగా చూస్తే ఐటీ ఇండస్ట్రీలో శాలరీలు అధికంగా ఉన్నాయని,  ఐటీ  ప్రొఫెషనల్స్ ఎక్కువ జీతాలను ఆర్జిస్తున్నారని రాండ్‌‌స్టాడ్ ఇన్‌‌సైట్స్ శాలరీ ట్రెండ్స్ రిపోర్ట్ 2019  పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, బెంగళూరులో కాస్ట్ టూ కంపెనీ(సీటీసీ) వార్షిక సగటు ఇతర సిటీలలో కంటే ఎక్కువగా ఉంది. జూనియర్ స్థాయిలో ఇది రూ. 5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయిలో రూ. 16.45 లక్షలుగా,  సీనియర్​ స్థాయిలో రూ. 35.45 లక్షలుగా ఉంది.  బెంగళూరు  2017, 2018 శాలరీ ట్రెండ్‌‌ రిపోర్ట్‌‌లో కూడా టాప్ పొజిషన్‌‌లోనే నిలిచింది.  జూనియర్ స్థాయిలో హైదరాబాద్ (రూ.5 లక్షలు), ముంబై(రూ. 4.59 లక్షలు)  రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మిడ్ లెవెల్‌‌లో ముంబై(రూ. 15.07 లక్షలు), ఎన్‌‌సీఆర్(రూ. 14.5 లక్షలు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, సీనియర్​ స్థాయిలో ముంబై(రూ. 33.95 లక్షలు), పుణే(రూ. 32.68 లక్షలు) బెంగళూరు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జూనియర్ స్థాయి(రూ. 4.96 లక్షలు), సీనియర్​ స్థాయి(రూ. 35.84 లక్షలు)లో  ఐటీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ వార్షిక సీటీసీ సగటులో ముందున్నారు.  యావరేజ్​యాన్యుల్ సీటీసీ రూ. 35.65 లక్షలతో డిజిటల్ మార్కెట్ సీనియర్​ ప్రొఫెషనల్స్ ముందున్నారు. క్లౌడ్, ప్రొడక్ట్ మేనేజ్‌‌మెంట్, ఎనలటిక్స్, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ) , ఆటో మేషన్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది ఐటీ  టాప్ ఇండస్ట్రీగా నిలిచిందని ఈ రిపోర్ట్ తెలిపింది. జీఎస్‌‌టీలో నిపుణులు, మేనేజ్‌‌మెంట్ కన్సల్టెంట్స్, లాయర్స్ వంటి జాబ్స్‌‌కు డిమాండ్ పెరుగుతోంది. అందువలన ప్రొఫెషనల్ సర్వీసెస్ సెక్టార్ జూనియర్, సీనియర్ స్థాయిలో టాప్–2 ఇండస్ట్రీగా నిలిచిందని పేర్కొంది.  పైథాన్ స్పెషలిస్ట్‌‌లు రూ. 31.09 లక్షల యాన్యుల్ యావరేజ్​సీటీసీతో అధికంగా జీతాలందుకుంటున్న స్పెషలిస్ట్‌‌లలో ముందున్నారు. హడూప్​ స్పెషలిస్ట్‌‌లు రూ. 19.01 లక్షలతో, స్పెషలిస్ట్ డాక్టర్స్ రూ. 18.01 లక్షలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టాలెంట్‌‌తో పాటు సరియైన స్కిల్స్ ఉన్న ఉద్యోగులను కంపెనీ లు అధిక శాలరీ ఇచ్చి పనిచేయించుకుంటున్నాయని రాండ్‌‌స్టాడ్ ఇండియా ఎండీ, సీఈఓ పౌల్ డుపిస్​ అన్నారు.  డిమాండ్ లేని స్కిల్స్ ఉన్న ఉద్యోగుల విషయంలో  కంపెనీలు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలిపారు.  ఎనిమిది నగరాలలో విస్తరించిన 15 సెక్టార్లకు చెందిన లక్ష ఉద్యోగాలను రాండ్‌‌స్టాడ్ ఇండియా ఇన్‌‌సైట్స్ శాలరీ ట్రెండ్స్‌‌ రిపోర్ట్ 2019 విశ్లేషించింది.

Bengaluru highest paying city, IT highest paying industry in India: Report